BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:23 PM
112 వీక్షణలు

జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి  — ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరిన ఏపీఎంపీఏ నాయకులు

విజయవాడ, మార్చి 23: జర్నలిస్టుల సంక్షేమం కోసం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు కలెక్టర్‌ను కలిసి రెండు వినతిపత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేమినేని వెంకటరమణ, కోశాధికారి మత్తి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి చైతన్య, నగర అధ్యక్షుడు తాళ్లూరి అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బొడ్డు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా అక్రిడిటేషన్లు పారదర్శకంగా అందజేసినందుకు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, నివాస స్థలాలు, బ్యాంకు రుణాలపై సబ్సిడీలు కల్పించాలని కోరారు.

అదేవిధంగా విజయవాడ నగరంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాలు, చర్చలు, వృత్తి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రెస్ క్లబ్ ఎంతో అవసరమని తెలిపారు.

2026–27 ఆర్థిక సంవత్సరంలో అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని సూచించారు. జిల్లాలో సుమారు 2000 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నప్పటికీ తగిన సదుపాయాలు అందడం లేదని పేర్కొన్నారు.

వినతిపత్రాలపై స్పందించిన కలెక్టర్, జర్నలిస్టులకు మేలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు మరకాల గోపి, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్, కోశాధికారి మల్లెల శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.