BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జయపురంలో టీడీపీ సీనియర్ నేత కొల్లి వరప్రసాద్ రావుకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 07:13 PM
147 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం:

చాట్రాయి మండలం తుమ్మగూడెం శివారు జయపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొల్లి వరప్రసాద్ రావు మృతదేహానికి టీడీపీ, బీజేపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.

కొల్లి వరప్రసాద్ రావు పార్థివ దేహానికి చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మందపాటి బసవారెడ్డి, మాదాసు చిన్న పుల్లయ్య, కాపా శ్రీనివాస్ రావు, బీజేపీ నేత నెక్కలపు వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొల్లి వరప్రసాద్ రావు పార్టీకి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. కష్టకాలంలో కూడా పార్టీకి అండగా నిలిచి, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ.. వరప్రసాద్ రావు క్రమశిక్షణ కలిగిన నాయకుడని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

నెక్కలపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొల్లి వరప్రసాద్ రావు రాజకీయాల్లో విలువలు పాటించిన నాయకుడని, ప్రజలతో మమేకమై పనిచేసిన మంచి వ్యక్తి అని అన్నారు.

కాపా శ్రీనివాస్ రావు, మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ.. కొల్లి వరప్రసాద్ రావు సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని కొల్లి వరప్రసాద్ రావుకు నివాళులు అర్పించారు.