BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 February 2026, 11:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రతి మండలంలో జాబ్ కార్డులు జారీ చేయాలి

తెలంగాణ
17 Feb, 2026 - 11:26 AM
365 వీక్షణలు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి మండలంలో జాబ్ కార్డులు జారీ చేయాలి: జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పూర్తిచేసిన లబ్ధిదారులకు జాబ్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్ హాల్లో ఎంపీడీవోలు, ఎంపీఓలు, హౌసింగ్ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మండలాల వారీగా వివరాలు సేకరించారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిచేసిన లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు అందించడంతో పాటు, 90 రోజుల పని దినాలకు చెల్లింపులు ఎలాంటి ఆలస్యం లేకుండా జరిగాయా అనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసిన వారికి రూ.12,000 చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరికీ జాబ్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, శ్రీరాములు, ఎంపీడీవోలు, ఏపీవోలు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #IndirammaHouses #JobCards #MGNREGS #RuralDevelopment #YadadriBhuvanagiri Follow us on Website Facebook Instagram YouTube