BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 13 April 2026, 02:47 pm
Posted by : V శ్రీనివాస్

​కాలపరిమితి ముగిసినా డబ్బులివ్వరా?

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Apr, 2026 - 02:47 PM
173 వీక్షణలు

​​కాలపరిమితి ముగిసినా డబ్బులివ్వరా? - మందమర్రి సహారా కార్యాలయం ముందు బాధితుల ఆందోళన

మందమర్రి, ఏప్రిల్ 13:

సహారా ఇండియా సంస్థలో తాము దాచుకున్న నగదు కాలపరిమితి ముగిసి ఏళ్లు గడుస్తున్నా యాజమాన్యం చెల్లించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ సెంటర్‌లోని సహారా కార్యాలయం ముందు బాధితులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లేకార్డులతో నిరసన చేపట్టారు.

​ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి సహారా సంస్థలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశామని, గడువు ముగిసి 4 నుండి 5 ఏళ్లు గడుస్తున్నా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారే తప్ప డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలను వారు కోరారు. తమకు న్యాయం జరగకుంటే జిల్లా వ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సహారా ఇండియా మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

​పాల్గొన్న వారు:

ఈ నిరసన కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, బాధితులు సిహెచ్ సంజీవ్, డి రాజమౌళి, రామ్ నరేష్ బాబు, సిహెచ్ సంపత్, ఎస్ మధు, దుర్గం మల్లేశ్వరి, భేరి రమాదేవి, దూత లక్ష్మి, పాషా, అబేదా తదితరులు పాల్గొన్నారు.