BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 04:09 pm
Posted by : V శ్రీనివాస్

కాంగ్రెస్ హామీల అమలుపై బీజేపీ విమర్శలు.. కాగజ్‌నగర్ సీఎం సభ పూర్తిగా విఫలం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 04:09 PM
209 వీక్షణలు

రెండు తప్ప మిగిలిన హామీలన్నీ ప్రజలను మోసం చేయడానికే..

మంచిర్యాల అభివృద్ధిని గాలికొదిలేశారు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్‌రావు ధ్వజం

​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కేవలం రెండు మాత్రమే అమలయ్యాయని, మిగిలినవన్నీ ప్రజలను మోసం చేయడానికేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్‌రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభ పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తాను గెలిచిన నాలుగు సీట్లలోనూ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తన స్వలాభం కోసమే కాంగ్రెస్‌లోని మరో వర్గం వైపు వెళ్లారని మండిపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఒక గిరిజన మహిళ తమ గ్రామంలో పాఠశాల, కనీస తాగునీటి సౌకర్యం లేవని ప్రశ్నించడమే ఈ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యమని, క్షేత్రస్థాయి సమస్యలను పక్కనబెట్టి స్థానిక ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. మంత్రుల వద్దే మకాం వేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

​మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రఘునాథ్‌రావు ధ్వజమెత్తారు. గోదావరిపై వంతెన నిర్మాణం, టూ టౌన్ ఫ్లైఓవర్, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఐటీ కారిడార్ ఏర్పాటుతో పాటు ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం వంటి అంశాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం 80 శాతం పనులు పూర్తి చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చివరకు ప్రభుత్వ సభలకు జనాలను తరలించేందుకు కనీసం ఫిట్‌నెస్ లేని బస్సులను ఉపయోగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదని, ఇకనైనా స్వార్థ రాజకీయాలు పక్కనబెట్టి నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు