BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 June 2026, 01:48 pm
Posted by : V శ్రీనివాస్

​కాంగ్రెస్ రాజ్యసభ సీటును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:48 PM
167 వీక్షణలు

  • బీజేపీ, ఈసీఐ కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడుతున్నాయి
  • ​రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

​మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకోవడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య విరుద్ధమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న కుంభకోణాల వల్లే ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశంలో జరుగుతున్న ‘ఓటు చోరీ’ పై నిరంతరం పోరాడుతున్నారని, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన పవిత్రమైన హక్కులను దొంగిలించి భారతీయ జనతా పార్టీ నాయకులు దొడ్డిదారిన అధికారంలో కూర్చుంటున్నారని విమర్శించారు.

​గతంలో ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కై నామినేషన్ల పరిశీలన నివేదిక పేరుతో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అదే పునరావృతం చేశారని ధ్వజమెత్తారు. అక్కడ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్‌లో కావాలనే తప్పులున్నాయనే నెపంతో తిరస్కరించడం వారి కుట్రకు నిదర్శనమని ఆరోపించారు. హక్కు ప్రకారం కాంగ్రెస్‌కు రావాల్సిన సీటును అడ్డుకుని, తిరిగి భారతీయ జనతా పార్టీకే దక్కేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు