BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 03 July 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 07:10 AM
104 వీక్షణలు

రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటికీ ఆమె సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

యాదగిరిగుట్ట నూతన దేవస్థాన పాలక మండలి బోర్డు ఏర్పాటు విషయంలో మంత్రి కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆమె విదేశాల్లో ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డును ప్రకటించారు.

తనతో సంప్రదింపులు జరపకుండా బోర్డు ఏర్పాటు చేయడంపై మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదన్న చర్చ సాగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం లేదా మంత్రి కొండా సురేఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.