BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 03 July 2026, 07:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాలుగు కమిషనరేట్ల పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సి.వి. ఆనంద్ సమీక్ష

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 07:10 AM
119 వీక్షణలు

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)  గురువారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆయా కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, పరిధుల విభజన, పరిపాలనా అవసరాలు తదితర అంశాలపై తమ ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు.

ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ హద్దులను నిర్ణయించాలని సూచించారు.

భవిష్యత్ పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల పోలీస్ స్టేషన్ పరిధుల నిర్ణయంపై ప్రత్యేక సూచనలు చేసిన డీజీపీ, పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పులు, చేర్పుల వల్ల ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఆయా ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా పోలీస్ స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజాకేంద్రిత, సమర్థవంతమైన పోలీసింగ్ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని డీజీపీ ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్లు, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.