తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం.. టిమ్స్‌లో 6,278 ఉద్యోగాలు.. మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్లు
హైదరాబాద్: ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా భోజన పథకం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి పోషకాహారం అందించడం ద్వారా విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
వీబీజీ రామ్‌జీ పథకంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకంపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా అమలు చేస్తోందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేబినెట్ నిర్ణయించింది.
కూలీలకు ఉపాధి భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2006లో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ పథకంపై గతంలో మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది.
నిరుపేదల హక్కులను హరించే విధంగా వీబీజీ రామ్‌జీ పథకం ఉందని, దీనిని వ్యతిరేకిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండా యథాతథంగా అమలు చేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. అయితే, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావించినట్లు తెలిపారు.
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ నియామకాలు
ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితర పోస్టులతో కలిపి మొత్తం 6,278 ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రులను తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీలు జారీ చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి రూ.7,345 కోట్లు
హైదరాబాద్‌లోని రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్-1 పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును పూర్తి చేయడానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రూ.7,345 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రులు వెల్లడించారు.
మంత్రుల వెల్లడి
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు , , మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా వ్యవస్థ బలోపేతం, కూలీల సంక్షేమం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.