BREAKING
thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం
Date of Publish : 18 June 2026, 08:20 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి- సిపిఐ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
18 Jun, 2026 - 08:20 AM
130 వీక్షణలు

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బొమ్మలరామారం మండల కమిటీ సమావేశం నాగినేనిపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ మండల కార్యదర్శి బుడుమ సంధ్యారాణి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ కార్యదర్శి Yanala Damodar Reddy హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను మంజూరు చేయాలని కోరారు.

వడపర్తి గ్రామం నుంచి చీకటి మామిడి వరకు ఉన్న రహదారి నిర్మాణం రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పూర్తి కాకపోవడం అధికారుల, కాంట్రాక్టర్ల వైఫల్యమని విమర్శించారు. వెంటనే రహదారి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మండలంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, రైతులకు అవసరమైన మేర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని కోరారు.

అలాగే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి గృహ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి బోలాగని సత్యనారాయణ, మండల నాయకులు అన్నేమైన వెంకటేశం, వడ్లకొండ భారతమ్మ, ఏనగల్ల రాజప్ప, ధీరావతు విట్టల్, ఇండ్ల చిట్టి, ఎడ్జెర్ల సాయిలు, కారం కొండ ఆనంద్, లక్ష్మీ, కమల తదితరులు పాల్గొన్నారు.