BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేసీఆర్‌, బీజేపీని బొందపెట్టాలి: రాంచందర్ నాయక్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
101 వీక్షణలు

గిరిజనుల ప్రతి ఇంటా ఇందిరమ్మ ఫొటో ఉండాలి.. కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపు

డోర్నకల్: కేసీఆర్‌, బీజేపీని రాజకీయంగా బొందపెట్టకపోతే వెనుకబడిన జాతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వ విప్‌, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. ఇందిరమ్మ ఆశీర్వాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గిరిజనులు ప్రతి ఇంటా ఇందిరమ్మ ఫొటోను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సేవాలాల్ మహారాజ్‌ను ఎలా ఆరాధిస్తామో, అదే విధంగా ఇందిరమ్మను కూడా గౌరవించాలని పేర్కొన్నారు. "ఒకే మాట.. ఒకే బాట.. ఒకే చోట" అనే నినాదంతో గిరిజనులందరూ ఏకమై కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాంచందర్ నాయక్ తెలిపారు.