BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 10 August 2026, 10:48 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

కడెం ఆయకట్టు నీటి విడుదలపై BRS, BJP అసత్య ప్రచారం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
10 Aug, 2026 - 10:48 PM
321 వీక్షణలు

రైతుల సంక్షేమమే మా లక్ష్యం – రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించొద్దు

కడెం ఆయకట్టు పరిధిలో రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రైతుల సంక్షేమం కోసమే నీటిని విడుదల చేస్తున్నాం. కానీ BRS, BJP పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కడెం ఆయకట్టు నీటి విడుదలపై అవాస్తవాలు, నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.

రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించాల్సింది పోయి, వాటిపై బురదజల్లే ప్రయత్నం చేయడం ద్వారా BRS, BJP నాయకులు తమ రాజకీయ వైఖరిని బయటపెట్టుకుంటున్నారు. రైతులు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు రైతుల కోసం పనిచేస్తున్నారో, ఎవరు కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రేమ్ సాగర్ రావును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే BRS, BJP నాయకులు వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలకు దిగుతున్నారు. పాదయాత్రలు చేయడం, పొర్లుదండాలు పెట్టడం వేరు.. ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేయడం వేరు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే మా నాయకత్వానికి తెలుసు.

BRS, BJP నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం — రైతుల ప్రయోజనాలతో రాజకీయాలు చేయడం మానుకోండి. కడెం ఆయకట్టు నీటి విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రతి ఆరోపణకు వాస్తవాలతో సమాధానం చెబుతాం.

ఇకనైనా అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. లేనిపక్షంలో BRS, BJP పార్టీల అసలు రాజకీయ స్వరూపాన్ని ప్రజల ముందు ఎండగట్టి, రాబోయే రోజుల్లో రాజకీయంగా దీటైన సమాధానం ఇస్తాం.

రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యం.

రైతుల కోసం తీసుకునే ప్రతి నిర్ణయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.

అంకతి శ్రీనివాస్ RTA MEMBER మంచిర్యాల జిల్లా గడ్డం త్రిమూర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పార్టీ అధ్యక్షులు నలిమెల రాజు సాహిద్ నాగభూషణo కౌన్సిలర్లు సర్పంచ్ లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు