కంభంపాడు సంజీవపురం బజారులో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు సంజీవపురం బజారులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం సజావుగా పూర్తయింది.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా సహకరించిన గ్రామ పెద్దలను ఏసీపీ పి. రామచంద్రరావు అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతి వెంకన్న, రామకృష్ణలను శాలువాతో సత్కరించారు. గ్రామంలో ఐకమత్యం, సామరస్యాన్ని కొనసాగించాలని సూచించారు.
కుల, మత, ప్రాంతీయ భేదాలకు తావులేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని ఏసీపీ పి. రామచంద్రరావు పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ గురు ప్రకాష్, ఎస్‌ఐ గంధం మహాలక్ష్ముడు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు.