BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 04 March 2026, 08:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

తెలంగాణ
04 Mar, 2026 - 08:05 AM
268 వీక్షణలు
ఘనంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం NTODAY NEWS: చిట్యాల హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గదేవి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన 23వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మహోత్సవాల్లో కనకదుర్గ ఆలయ చైర్మన్ మారవుని ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, బొబ్బల సందీప్ రామ్ రెడ్డి, కోనేటి ఎల్లయ్య, జర్రిపోతుల సత్యనారాయణ, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, నాగిళ్ల సుధాకర్, ఎస్కే నజీమా, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాసు, మాజీ మార్కెట్ చైర్మన్ పందిరి శ్రీనివాస్, సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సుందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే పాటీ మాధవరెడ్డి, పాటి నర్సిరెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, ఎద్దులపురి కృష్ణ, పిశాటి బీష్మారెడ్డి, బెల్లి సత్తయ్య, గాలి యాదగిరి, దేశపాక రాజేష్, జిట్ట రవి, పల్లపు బుద్ధుడు, కోనేటి యాదగిరి, శేఖర్, దాసరి వెంకన్న, దాసరి కిరణ్, కంభంపాటి సత్యనారాయణ, పుల్లెంల కోటయ్య, మెట్టు మనోహర్, కాసుల సత్యనారాయణ, పంతంగి వెంకన్న గౌడ్, డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల, కృష్ణమూర్తి, రుద్రారపు లింగస్వామి, జిట్ట సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోవిందు శర్మ, దుర్గేష్ శర్మ, శుభం శర్మతో పాటు సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Chityal #KanakaDurgaTemple #Nalgonda #VemulaVeeresham #TempleFestival #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube