BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 14 July 2026, 06:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఏసీబీ నోటీసులు.. బ్యాంకు ఖాతాలు, పాన్‌ వివరాలు కోరింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 06:02 AM
113 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో అవినీతి వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఇటీవల నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ ఉద్యోగుల బ్యాంకు ఖాతా వివరాలు, పాన్‌ నంబర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందించాలని ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి, నిజామాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది.

దాడుల్లో లభించిన సమాచారంతో అక్రమ వసూళ్లు, నెలవారీ మామూళ్ల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ అంశాలపై అధికారికంగా ఏసీబీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం సంబంధిత సమాచారం సేకరణ, ప్రాథమిక పరిశీలన కొనసాగుతోంది.