BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 July 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాము కాటుకు ఇక 108లోనే ప్రాణరక్షక ఇంజక్షన్లు..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 09:34 PM
189 వీక్షణలు

పల్లెల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఎదుర్కొనే ప్రమాదాల్లో పాము కాటు ప్రధానమైనది. ముఖ్యంగా తాచు, రక్తపింజరి, కట్లపాము వంటి విషసర్పాల కాటు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అయితే సమయానికి చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు వేగంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 108 అంబులెన్స్‌లలో పాము కాటు చికిత్సకు అవసరమైన ప్రాణరక్షక ఇంజక్షన్లు (యాంటీ స్నేక్ వెనం) అందుబాటులో ఉంచుతోంది. అత్యవసర సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు.

ఈ నిర్ణయం వల్ల మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలు, రైతులకు సకాలంలో వైద్య సహాయం అందే అవకాశం పెరిగి, పాము కాటు కారణంగా జరిగే మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారనుంది.

 గమనిక: పాము కాటు వేస్తే వెంటనే 108కు కాల్ చేయండి. మంత్రాలు, మూఢనమ్మకాలను నమ్మకుండా బాధితుడిని ప్రశాంతంగా ఉంచి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడం అత్యంత ముఖ్యం.