BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి: ఐయార్లా జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 09:34 PM
69 వీక్షణలు

చాట్రాయి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా తీసుకొచ్చినట్లు ఆరోపిస్తున్న వి.బి. గ్రామ్ జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం (ఐయార్లా) ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు.

సోమవారం చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలను సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ చాట్రాయి మండల కార్యదర్శి కలపాలి వెంకటేశ్వరరావు, చాట్ల బాబూరావు ఆధ్వర్యంలో కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గం పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో విస్తృతంగా సభ్యత్వ నమోదు కొనసాగుతోందని తెలిపారు.

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 200 రోజులకు, రోజువారీ వేతనాన్ని రూ.600కు పెంచి, అవకతవకలను అరికట్టి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని గ్రామీణ కార్మికులు కోరుతున్నారని అన్నారు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

2005లో గ్రామీణ పేదలకు ఉపాధి హక్కు కల్పించి, వలసలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పేరుమార్పులు, కొత్త విధానాల పేరుతో చట్టం అసలు లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం, పని ప్రదేశాల్లో షామియానాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా అనుసరిస్తోందని విమర్శించారు.

కార్యక్రమంలో ముళ్లపూడి నాగేశ్వరరావు, తాణికి జయరాజు, దేవరాజు, తిలక్, కంకట నాగేశు తదితర ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.