BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

396 జీవో రద్దు చేయాలంటూ జూలై 20 నుంచి పెన్‌డౌన్ సమ్మెకు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:36 PM
112 వీక్షణలు

కడప నగరంలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు లేఖరుల సహాయకుల సమావేశం సంజీవరాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకులు జూలై 20 నుంచి జూలై 31 వరకు చేపట్టనున్న పెన్‌డౌన్ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సమావేశం అనంతరం జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పెన్‌డౌన్ సమ్మెకు సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించి, సమ్మె విజయవంతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.