BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.. ఎండీఎం భోజనం రుచిగా, శుచిగా ఉండాలి: ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:36 PM
208 వీక్షణలు

చాట్రాయి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సీ. గుడిపాడు ఎంపీపీఎస్ ప్రధాన పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డులను పరిశీలించారు.

అనంతరం చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై, అలాగే పాఠశాల పని వేళల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులు విడిచి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తదుపరి మధ్యాహ్న భోజన (ఎండీఎం) పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనాన్ని ఎల్లప్పుడూ రుచికరంగా, శుభ్రంగా తయారు చేసి విద్యార్థులకు వడ్డించాలని ఎండీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.

ఈ తనిఖీల్లో సీ. గుడిపాడు ప్రధానోపాధ్యాయురాలు హేమ నాగశ్రీ, చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొన్నారు.