BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 14 July 2026, 03:40 pm
Posted by : V శ్రీనివాస్

​యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిని పదవి నుండి తొలగించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jul, 2026 - 03:40 PM
120 వీక్షణలు

​బీసీ మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి

మంచిర్యాల :యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ పై యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండించింది.

​స్థానికంగా ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీలో శివచరణ్ రెడ్డి తండ్రి ఫోటో పెట్టలేదనే నెపంతో, ఒక బీసీ మహిళ అని కూడా చూడకుండా ఈశ్వరమ్మ యాదవ్ ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంపై సమితి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక బీసీ మహిళకు దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఉన్నత అవకాశం దక్కడాన్ని జీర్ణించుకోలేకే శివచరణ్ రెడ్డి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది బీసీ సామాజిక వర్గాలపై ఆయనకున్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.

​అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శివచరణ్ రెడ్డి తక్షణమే ఈశ్వరమ్మకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనను యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, ముఖ్య నాయకులు శాకపూరి భీంసేన్, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు