BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 14 July 2026, 03:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:38 PM
127 వీక్షణలు

పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్‌ను కరీంనగర్ ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీకి పంపేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.

అనంతరం నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.32.31 లక్షల విలువైన లెక్కల్లో చూపని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన నగదు మూలాలపై అధికారులు విచారణ చేపట్టారు.

నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.