BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 06 July 2026, 11:07 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

కన్న తల్లి, కుమారుడి మృతిని తట్టుకోలేక.. మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

తెలంగాణ
/ తెలంగాణ
06 Jul, 2026 - 11:07 AM
90 వీక్షణలు

ములుగు | NTODAY NEWS

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి, కుమారుడి వరుస మరణాలను తట్టుకోలేక కంతి నాగయ్య (40) బలవన్మరణానికి పాల్పడ్డారు.

మంగవాయి గ్రామానికి చెందిన నాగయ్య తల్లి కన్నమ్మ (70) ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఆయన పెద్ద కుమారుడు అశోక్ (22) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ రెండు విషాద ఘటనలతో తీవ్ర మనోవేదనకు గురైన నాగయ్య మద్యానికి బానిసయ్యారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం పొలానికి వెళ్లి పురుగుమందు తాగగా, గమనించిన గ్రామస్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.