BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 06:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండపర్వలో చెరువుల హద్దులు.. ఆక్రమణలపై ఆర్డీవో పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 06:45 AM
15 వీక్షణలు


కొండపర్వలో చెరువుల హద్దులు.. ఆక్రమణలపై ఆర్డీవో పరిశీలన

విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వలో జానకట్ట చెరువు, బత్తుల చెరువుల పరిధి, వాటి హద్దులు, ఆక్రమణల పరిస్థితిని ఆర్డీవో ఏ. కుమార్ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువులకు సంబంధించిన ప్రభుత్వ భూముల్లో ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో గుర్తించాలని విస్సన్నపేట తహసీల్దార్‌ను కె లక్ష్మీ కల్యాణిని ఆదేశించారు.

మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులతో సమగ్రంగా సర్వే నిర్వహించి చెరువుల అసలు హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని సూచించారు. ఆక్రమణలు ఉన్నట్లు గుర్తిస్తే వాటి వివరాలను స్పష్టంగా నమోదు చేసి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్డీవో ఏ. కుమార్ తెలిపారు. చెరువుల ఆక్రమణలపై పూర్తిస్థాయి పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.