BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 02 August 2026, 07:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండపర్వలో పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 07:12 PM
63 వీక్షణలు

కొండపర్వలో పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో భారత జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి జాతీయ జెండాను రూపొందించి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని, ఆయన దేశభక్తి, త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు పింగళి వెంకయ్య చూపిన మార్గంలో నడిచి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో దాసరి శివ, తిరుపతిరావు, సూరిబాబు, సాయి, ధనుష్, మల్లయ్య స్వామి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.