BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 12 April 2026, 05:14 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు అర్థరహితం: కాంగ్రెస్ నాయకుల ధ్వజం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
12 Apr, 2026 - 05:14 PM
165 వీక్షణలు

ధర్మపురి తలాపున గోదావరి ఉన్నా నీళ్లివ్వలేని అసమర్థుడు కొప్పుల

​రెండేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? - మాజీ మంత్రికి సవాల్

​ధర్మపురి, ఏప్రిల్ 12: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఆదివారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, గొల్లపల్లి మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, వెల్గటూర్ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి తదితరులు కొప్పుల ఈశ్వర్ వైఫల్యాలను ఎండగట్టారు.

​పదేళ్ల అసమర్థత - ఆరు నెలల అభివృద్ధి

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ధర్మపురి పట్టణానికి కనీసం తాగునీరు అందించలేని వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అని విమర్శించారు. ఆయన హయాంలో మూతపడిన సంస్కృతాంధ్ర కళాశాలను, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లోనే పునరుద్ధరించారని గుర్తు చేశారు.

​మంత్రి అడ్లూరి హయాంలో ప్రగతి పథం:

​నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి అడ్లూరి చేపట్టిన పలు కీలక పనులను నాయకులు వివరించారు:

​విద్యా రంగం: రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, కొత్తగా డిగ్రీ కళాశాల ఏర్పాటు.

​తాగునీరు: అమృత్ పథకం కింద రూ. 22 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, రూ. 2 కోట్లతో బోర్ వెల్స్.

​పట్టణ అభివృద్ధి: TUFID ద్వారా రూ. 15 కోట్ల పనులు, కుల సంఘాల భవనాల కోసం రూ. 2 కోట్లు.

​పర్యావరణం: గోదావరి కలుషితం కాకుండా రూ. 7 కోట్లతో సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు.

​విద్యుత్ & గృహ నిర్మాణం: రూ. 4.60 కోట్లతో విద్యుత్ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ పథకం ద్వారా 3500 ఇళ్ల నిర్మాణం.

​బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందనే భయం

​"మంత్రి అడ్లూరి పనితీరుకు నిదర్శనం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే. 70% స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడం చూసి ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు మేము సిద్ధం" అని నాయకులు సవాల్ విసిరారు.

​మున్సిపల్ ఎన్నికల్లో కూడా ధర్మపురిలో 15కు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాగారం సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, వేముల రాజేష్, చీపురిశెట్టి రాజేష్, తిరుపతి, సుముఖ్ తదితరులు పాల్గొన్నారు.