BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 12 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరెంట్ షాక్‌తో పెనుగొలను యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
140 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన మీనుగు గోపి (26) శనివారం కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం, గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో అబ్బూరి రాంబాబు ఇంటికి రంగులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, గోపి తండ్రి వెంకటేశ్వరరావు కూడా ఏడాది క్రితమే మృతి చెందారు. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన ఏకైక కుమారుడు దుర్మరణం చెందడంతో తల్లి రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది.

ఈ ఘటనపై వాల్మీకి సంఘ నాయకులు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు గోపి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.