BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

వచ్చే నెలాఖరులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: మంత్రి కొలుసు పార్థసారధి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
117 వీక్షణలు

నూజివీడు, జూలై 12: నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వచ్చే నెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అధికారులను ఆదేశించారు. నూజివీడు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీలు, తాగునీటి పథకాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, వంతెనలు తదితర పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు.

పనుల వివరాలపై అధికారులు సమన్వయంతో సమాధానాలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, చేపట్టిన ప్రతి పనిని నిర్దేశిత గడువులో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో రూ.5 కోట్లతో చేపడుతున్న సెంటర్ లైటింగ్, స్మశాన అభివృద్ధి, ప్రహరీ గోడ, అదనపు షెడ్లు, రోడ్ల విస్తరణ, రాజీవ్ సర్కిల్, పెద్ద గాంధీ సెంటర్ తదితర ప్రధాన రహదారుల పనులను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

తోపుడు బండ్ల వ్యాపారులను సంఘాలుగా ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులతో సమావేశమైన మంత్రి, నియోజకవర్గంలోని ప్రతి మండలానికి వంద యూనిట్ల చొప్పున గొర్రెలు, మేకలు, ఆవుల పెంపకానికి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. గృహ నిర్మాణం, చిరు వ్యాపారాలు, తోపుడు బండ్ల వ్యాపారులు, పీఎంజీవీవై రుణాలు, సూర్యఘర్ సోలార్ పథకం, డెయిరీ యూనిట్లకు కూడా రుణాలు అందించి స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, పెద్ద ఫార్ములకు రూ.1 కోటి వరకు రుణాలు అందించేలా సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రుణాలపై అవగాహన కల్పించి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా చూడాలని సూచించారు.

మండలాల వారీగా పనుల పురోగతి

ఆగిరిపల్లి మండలం: రూ.21 కోట్లతో 162 పనులు ప్రారంభించగా 107 పూర్తయ్యాయి. మిగిలిన పనులు వచ్చే నెలాఖరులోపు పూర్తి చేయాలని, శోభనాచల దేవాలయ ఘాట్ రోడ్డును 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే ఇసుక, మెటల్ అందిస్తానని హామీ ఇచ్చారు.

నూజివీడు మండలం: రూ.24 కోట్లతో చేపట్టిన 180 పనుల్లో 104 పూర్తయ్యాయి. మిగిలిన సీసీ, బీటీ రోడ్లు సహా అన్ని పనులను వచ్చే నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

ముసునూరు మండలం: రూ.12 కోట్లతో ప్రారంభించిన 92 పనుల్లో 79 పూర్తయ్యాయి. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చాట్రాయి మండలం: రూ.6 కోట్లతో చేపట్టిన 58 పనుల్లో 48 పూర్తయ్యాయి. మిగిలిన పనులను వచ్చే నెలలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

తాగునీటి పనులపై ప్రత్యేక దృష్టి

రూరల్ వాటర్ సప్లై అధికారులతో మంత్రి తాగునీటి పథకాల పురోగతిని సమీక్షించారు. ముసునూరు మండలంలో ప్రారంభించిన 11 వాటర్ ట్యాంకుల్లో నాలుగు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు వివరించగా, మిగిలిన వాటిని 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

సూరేపల్లి, దేవరగుంట, పడమట, దిగవల్లి, ఎల్లాపురం గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త బోర్లు, వాటర్ ట్యాంకులు నిర్మించాలని సూచించారు. ఎల్లాపురం గ్రామంలోని వాటర్ ట్యాంకుకు నిచ్చెన ఏర్పాటు కోసం పంచాయతీరాజ్ నిధులు వినియోగించాలని ఆదేశించారు.

నూజివీడు రూరల్, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల్లో డ్రైనేజీలు, పైప్‌లైన్లు, బోర్లు, జల్ జీవన్ మిషన్ పనులు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.