BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 July 2026, 06:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి ఛాంపియన్‌షిప్–2026కు సిద్ధం కండి.. యువతకు మంత్రి పిలుపు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:48 AM
121 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటిలో ఛాంపియన్‌షిప్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అండర్–17, అండర్–23 బాలురు, బాలికల విభాగాల్లో మొత్తం 12 క్రీడాంశాల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఈ పోటీలు జరగనున్నాయని చెప్పారు.

అర్హులైన విద్యార్థులు, యువ క్రీడాకారులు తప్పనిసరిగా నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే యువతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, పీఈటీలు, ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.