BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 12 July 2026, 06:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనసేన ఎమ్మెల్యే భార్య vs జనసైనికుడు.. పోలవరంలో మళ్లీ రచ్చ! సోషల్ మీడియా పోస్ట్‌తో చెలరేగిన వివాదం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:47 AM
148 వీక్షణలు

పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో వర్గపోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టు చుట్టూ వివాదం చెలరేగి, చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

కొయ్యలగూడెం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ ఇంటికి ఎమ్మెల్యే సతీమణి జ్యోతి అనుచరులతో కలిసి వెళ్లి, తమ కుటుంబంపై సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు షేర్ చేశావని ప్రశ్నించారు. తాను పోస్టు సృష్టించలేదని, ఎవరో పంపిన సందేశాన్ని మాత్రమే షేర్ చేశానని సతీష్ వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే తమ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలని జ్యోతి కోరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో సతీష్‌ను అనుచరులు వాహనంలో తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. అనంతరం కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సతీష్, తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. చికిత్స కోసం అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే సతీమణి కూడా తమ కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎమ్మెల్యే భార్య కారు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సతీష్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు జోక్యం చేసుకుని విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఈ వివాదానికి కారణమైన సోషల్ మీడియా పోస్టులో ఎమ్మెల్యే దంపతుల వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వివాదాన్ని మరింత తీవ్రతరం చేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇప్పటికే పోలవరం జనసేనలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇటీవలే ఆరోపించారు. తన ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఇకపై సహించబోనని హెచ్చరించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

మొత్తంగా, సోషల్ మీడియా పోస్టుతో మొదలైన ఈ వివాదం జనసేనలోని అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. పోలీసు ఫిర్యాదులు, ఆరోపణలు, నిరసనల మధ్య ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.