BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 17 May 2026, 07:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 07:27 PM
192 వీక్షణలు

క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు

గుంటూరుకు చెందిన ప్రముఖ ప్రైవేటు వైద్యుడు క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.13 కోట్లు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి సైబర్ నేరగాళ్లు వైద్యుడిని వలలో వేసుకున్నారు. మొదట చిన్న మొత్తాల్లో లాభాలు చూపిస్తూ నమ్మకం కలిగించారు. అనంతరం మరింత డబ్బు పెట్టాలని ప్రోత్సహించడంతో వైద్యుడు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.

తనతో పాటు స్నేహితుల నుంచి సేకరించిన సొమ్మును కూడా ఈ పెట్టుబడుల్లో పెట్టినట్లు సమాచారం. కొంతకాలం పాటు ఆన్‌లైన్ ఖాతాలో లాభాలు కనిపించడంతో పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయనే భావించారు. అయితే డబ్బులు ఉపసంహరించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖాతా నుంచి నగదు తీసుకోలేకపోయారు.

దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ అధికారులు లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సమాచారాన్ని సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు.

అధిక లాభాల ఆశతో తెలియని ఆన్‌లైన్ పెట్టుబడులపై నమ్మకం పెట్టుకోవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.