BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 09:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమిళనాడు రాజకీయాల్లో భారీ సంచలనం.. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర?

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 09:23 AM
116 వీక్షణలు

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పన్నిన భారీ కుట్రను నిఘా విభాగం భగ్నం చేసినట్లు సమాచారం.

టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు రూ.35 కోట్ల ఆఫర్ ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కూడా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఆఫర్‌ను తిరస్కరించిన ఎమ్మెల్యేను ఐపీడీఎస్ కన్సల్టెన్సీకి చెందిన తిరునావుక్కరసు బెదిరించినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ మొత్తం కుట్ర వెనుక అధికార పార్టీ ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం హస్తం ఉందని ఎమ్మెల్యే ఇళయరాజా తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఆరోపణలపై అధికారికంగా డీఎంకే ఇంకా స్పందించలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.