BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 02 July 2026, 12:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం.. ఈనెల 16న ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 12:24 AM
108 వీక్షణలు

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి సందర్భంగా ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

జూలై 16, గురువారం నుంచి 24వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను ప్రత్యేకంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు.

ప్రధాన ఆలయం నుంచి గుండిచా మందిరం (మేనత్త ఇల్లు) వరకు ఈ పవిత్ర రథయాత్ర సాగుతుంది. లక్షలాది మంది భక్తులు రథాలను లాగడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

జూలై 24న బహుదా యాత్రతో స్వామివారి తిరుగు ప్రయాణం పూర్తవడంతో రథోత్సవం ముగియనుంది.

ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పూరీ క్షేత్రానికి తరలిరానున్నారు. దీంతో పూరీ నగరం ఇప్పటికే భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.