BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

క్రమశిక్షణకు పెద్దపీట.. వివాదాస్పద ఎమ్మెల్యేలకు టీడీపీ హైకమాండ్ షాక్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
146 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత క్రమశిక్షణపై పార్టీ అధిష్ఠానం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు పార్టీ గీసిన గీత దాటుతూ, సొంత అజెండాతో ముందుకెళ్తున్నారనే అభిప్రాయంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సొంత క్యాడర్‌తో విభేదాలు పెట్టుకోవడం, పార్టీ నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నించడం వంటి చర్యలకు పాల్పడుతున్న కొందరు ఎమ్మెల్యేలను ఇకపై హెచ్చరించడం కాకుండా నేరుగా పక్కన పెట్టే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోంది.

కొలికపూడి ఎపిసోడ్‌తో స్పష్టమైన సంకేతం

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల పార్టీ హైకమాండ్ నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శించడం పార్టీ పెద్దలకు అసంతృప్తి కలిగించింది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను పూర్తిగా పక్కనబెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను ఇతర నేతలకు అప్పగించడం ద్వారా పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదనే సంకేతం ఇచ్చింది.

సత్యవేడులో ఆదిమూలానికి దూరం

సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం వివాదాస్పద వ్యవహారశైలితో పార్టీకి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. మహిళతో వివాదాస్పద ఘటన తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడగా, వివాదం ముగిసినా పార్టీ తిరిగి ఆయనను కలుపుకోలేదు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ కూడా ఆయనకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే నియోజకవర్గ వ్యవహారాలు సాగేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని పార్టీ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

పది మందికి పైగా ఎమ్మెల్యేలపై నిఘా

రాష్ట్రవ్యాప్తంగా పది మందికి పైగా ఎమ్మెల్యేలపై పార్టీ ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రూపు రాజకీయాలు, ఇసుక-భూ వ్యవహారాల్లో జోక్యం, కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ నేతలతో విభేదాలు వంటి అంశాలపై ప్రతికూల నివేదికలు వచ్చిన నేతలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

‘వ్యవస్థ ముఖ్యం.. వ్యక్తులు కాదు’

2014-19 కాలంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చిందనే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కఠిన నిర్ణయాలకు టీడీపీ సిద్ధమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉండటంతో కొందరు ఎమ్మెల్యేలు దూరమైనా పెద్దగా నష్టం లేదనే భావనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

టికెట్ల కోతకు సంకేతాలా?

ప్రస్తుతం వివాదాస్పద ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కూడా స్పష్టమైన సంకేతాలను పార్టీ పంపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే నేతలకు భవిష్యత్తులో అవకాశాలు ఉండవన్న సందేశాన్ని టీడీపీ బలంగా ఇస్తోందని చర్చ సాగుతోంది.