BREAKING
మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి తలుపులమ్మ లోవ భక్తజనం మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి తలుపులమ్మ లోవ భక్తజనం
www.ntodaynews.com

50 శాతం రాష్ట్రానికే ఇవ్వాలి : డి.హరినాథ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 08:14 PM
90 వీక్షణలు

కృష్ణా గోదావరి బేసిన్‌లో గ్యాస్, పెట్రోల్‌లో 50 శాతం రాష్ట్రానికే ఇవ్వాలి : డి.హరినాథ్

పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మూడు రూపాయలు పెంచిందని, భవిష్యత్తులో మరింత పెంపు ఉండొచ్చని సంకేతాలు ఇస్తోందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశీయంగా ధరలు పెంచకపోతే చమురు సరఫరా సంస్థలు నష్టపోతాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారని పేర్కొన్నారు.

స్వదేశీ నినాదాలు చేసే కేంద్ర ప్రభుత్వం, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆంధ్రప్రదేశ్‌లో లభిస్తున్న కృష్ణా గోదావరి బేసిన్ చమురు, సహజవాయువులో 50 శాతం వాటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం స్థానిక వనరులపై స్థానిక ప్రజలకు హక్కు ఉండాలని తెలిపారు.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో విస్తరించిన కేజీ బేసిన్ గ్యాస్ సంపద రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని చెప్పారు. “మన గ్యాస్ – మన హక్కు” అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సహజవాయువులో రాష్ట్రానికి తగిన వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

రిలయన్స్ సంస్థ రాష్ట్ర సహజ వనరులను గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తోందని ఆరోపించారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సహజవాయువులో 50 శాతం వాటాను సంబంధిత రాష్ట్రాలకు కేటాయించే నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని సూచించారు.

కేజీ బేసిన్ డి-6 ప్రాజెక్టును రిలయన్స్‌కు కేటాయించినప్పుడు 50 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వెంటనే స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, హామీలు అమలు చేయకపోతే ప్రాజెక్టును జాతీయం చేయాలని డిమాండ్ చేశారు.

గోదావరి, కృష్ణా జలాలను వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని తెలిపారు. రాష్ట్రానికి గ్యాస్ సరఫరా పెరిగితే విద్యుత్ కొరత తగ్గడంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. రవాణా రంగంలో బస్సులు, లారీలు, కార్లు, ఆటోల్లో సీఎన్‌జీ వినియోగం పెరిగితే ఇంధన ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని చెప్పారు.

గృహ అవసరాలకు పైప్‌లైన్ ద్వారా సహజవాయువును తక్కువ ధరకు అందించవచ్చని, ప్రస్తుతం రూ.980 దాటిన గ్యాస్ సిలిండర్ ధరల బదులు పైప్ గ్యాస్‌ను సుమారు రూ.200కే అందించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో లభించే గ్యాస్ సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిలో వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడిన సహజవాయువును రాష్ట్ర ప్రజలకు అందించడంలో కేంద్ర, కార్పొరేట్ విధానాలు అడ్డంకిగా మారాయని డి.హరినాథ్ ఆరోపించారు.