BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 10:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్ వద్ద విజిబుల్ పోలీసింగ్ – ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jun, 2026 - 10:21 PM
159 వీక్షణలు

ఏలూరు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ దిశానిర్దేశనలతో, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్.ఐ డి. రామకృష్ణ మరియు వారి సిబ్బంది కృష్ణారావుపాలెం చెక్ పోస్ట్ వద్ద విస్తృత విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.

చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడం, నేరాలను నిరోధించడం మరియు భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టారు. వాహనదారులు అధిక వేగం, అజాగ్రత్త వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందని పోలీసులు సూచించారు.

ద్విచక్ర వాహనదారులు ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి నాణ్యమైన హెల్మెట్ ధరించాలి అని ప్రత్యేకంగా సూచించారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించే ‘ప్రధాన మంత్రి రాహత్ పథకం’ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయడంలో వెనుకాడరాదు, ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, ‘గుడ్ సమరిటన్’ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసుల లక్ష్యం అని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్.ఐ డి. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.