BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 July 2026, 09:54 pm
Posted by : V శ్రీనివాస్

​యువతపై లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ ప్రధాని నివాసం ఎదుట రాహుల్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధర్నా

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 09:54 PM
223 వీక్షణలు

​యువతపై లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ ప్రధాని నివాసం ఎదుట రాహుల్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధర్నా

న్యూఢిల్లీ: తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రధానమంత్రి నివాసం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

​శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు పలువురు నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. బలప్రయోగం ద్వారా యువత గొంతు నొక్కలేరని, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు