BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 12:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ప్రజా కవి అద్దేపల్లి రామమోహనరావు 90వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 12:40 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా కవి అద్దేపల్లి రామమోహనరావు 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ.. 1936 సెప్టెంబర్ 6న బందర్ శివారు చింతగుంటపాలెంలో జన్మించిన అద్దేపల్లి రామమోహనరావు తెలుగు సాహిత్యంలో విప్లవ కవిగా, ప్రజా కవిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. మధుజ్వాల, రక్తసంధ్య, సంఘం శరణం గచ్చామి, పొగచూరిన ఆకాశం తదితర 13 కవితా సంపుటాలు, 25 విమర్శనా గ్రంథాలు రచించడంతో పాటు సుమారు 600 పుస్తకాలకు ముందుమాటలు రాసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు.

1990లో ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ తొలిగళం వినిపించిన కవిగా ఆయన ‘ప్రజాకవి’ బిరుదు పొందారని పేర్కొన్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై లోతైన విమర్శతో సాహితీ లోకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు.

సాహితీ స్రవంతి సంస్థ ద్వారా ఎంతోమంది యువ కవులను ప్రోత్సహించి, సాహిత్య రంగంలో వారికి మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు. 2016 జనవరి 13న కాకినాడలో ఆయన కన్నుమూశారని, ఆయన అందించిన సాహితీ సేవలు నేటికీ చిరస్మరణీయమని వక్తలు కీర్తించారు.

ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, వి. యజ్ఞకృష్ణ, పి. కిట్టయ్యతో పాటు గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.