BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 01:16 pm
Posted by : ఈడూరి డేవిడ్

పల్లంట్లలో ఘనంగా గ్రామ స్వరాజ్యం సంకల్పయాత్ర

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
06 Sep, 2026 - 01:16 PM
2 వీక్షణలు

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర.. భారీగా పాల్గొన్న మహిళలు, యువత, టీడీపీ శ్రేణులు

దేవరపల్లి | Ntoday News

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామ స్వరాజ్యం సంకల్ప పాదయాత్ర ను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

టీడీపీ సీనియర్ నాయకులు కొయ్యలమూడి చినబాబు, సుధారాణి నాయకత్వంలో గ్రామం నుంచి మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, యువత, కార్యకర్తలకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కూచిపూడి బాబ్జి, తాళ్లూరి శ్రీను, చింతల దాసు, మందపాటి సత్యనారాయణ, మందపాటి వెంకటరత్నం, అక్కబత్తుల రమణ తదితరులు పాల్గొన్నారు.