కోడూరు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందడపు రాం ప్రదీప్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాం ప్రదీప్ అవార్డును అందుకున్నారు.
విద్యారంగంలో విశేష సేవలతో పాటు సామాజిక సేవ, రచనా రంగాల్లోనూ నిరంతరం చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం రాం ప్రదీప్‌ను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు రాం ప్రదీప్‌కు అభినందనలు తెలిపారు. కోడూరు గ్రామానికి, ఏ.కొండూరు మండలానికి ఈ అవార్డు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.