రాయచోటి జిల్లా: వీరబల్లిలో వినాయక చవితికి డీజేలకు అనుమతి లేదు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
వీరబల్లి మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్సై సుస్మిత సూచించారు. మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని, పోలీస్‌స్టేషన్‌లో అవసరమైన పత్రాలు సమర్పించి అనుమతులు పొందాలని తెలిపారు.
డీజేలు, డీజే బండ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మైక్‌లను నిర్ణీత శబ్ద పరిమితులకు లోబడి మాత్రమే వినియోగించాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, విద్యుత్ శాఖ అనుమతులు పొందాలని తెలిపారు.
నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గాల్లోనే ఊరేగింపు నిర్వహించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని ఎస్సై సుస్మిత కోరారు.