BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 July 2026, 09:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఎస్‌ఎఫ్‌ఐ భారీ ప్రదర్శన.. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నినాదాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 09:56 PM
63 వీక్షణలు

తిరువూరులో ఎస్‌ఎఫ్‌ఐ భారీ ప్రదర్శన.. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నినాదాలు

తిరువూరు, జూలై 21: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ డిమాండ్లతో నినాదాలు చేశారు.

ఢిల్లీలో నిన్న విద్యార్థులు, యువకులపై జరిగిన దాడిని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నీట్ పరీక్ష లీకేజీ కారణంగా 20 మంది విద్యార్థులు మరణించారని ఆరోపిస్తూ, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.

అలాగే, ఈ అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం కూడా బాధాకరమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.