BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 09:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 09:54 PM
80 వీక్షణలు

చిన్నంపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో బి శివశంకర్ నిర్వహణ

చాట్రాయి, జూలై 21: చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో మంగళవారం "పొలం పిలుస్తుంది" కార్యక్రమాన్ని ఏవో బి శివశంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నీటి యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం, నీటి లభ్యత క్షీణించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాలు తక్కువగా కురిసినప్పుడు లేదా భూగర్భ జలాలు తగ్గిన సందర్భాల్లో నష్టాలను నివారించేందుకు మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, కంది, పెసర, మినుము, నువ్వులు, ఆముదం, సోయా వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వివరించారు.

అలాగే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పనిసరిగా ప్రధానమంత్రి పంట బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని, ఈ-పంటలో తమ పంట వివరాలను నమోదు చేయాలని సూచించారు. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డు (సీసీఆర్‌సీ) పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, గ్రామ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సభ్యుడు అత్తులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.