BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 09 April 2025, 10:17 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మండల అధికారులకు కీలక ఆదేశాలు జారీ

తెలంగాణ
09 Apr, 2025 - 10:17 AM
221 వీక్షణలు
మండల అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 9 -ఇప్పలపల్లి నరేందర్ జాయింట్ నల్గొండ జిల్లా బ్యూరో ప్రజలు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్ లేకుండా,ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాజాపేట,తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాహశీల్దార్ కార్యాలయాలను, ఎంపీడీవో కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ధరణి లో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం వచ్చిన అప్లికేషన్ లను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంట వెంటనే పరిష్కరించి ప్రజలకు అందించాలన్నారు.రేషన్ కార్డు ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన ఎంక్వయిరీ చేసి దరఖాస్తుదారులకు అందించే విధంగా చూడాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్ధి దారులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓకి ఆదేశాలు జారీ చేశారు.ఇందిరమ్మ ఇండ్లలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం ఈ నెల 14వ తేదిన గడువు ముగియునందున్న ప్రజలకు అవగాహన కల్పించి లబ్ధింపొందేలాచూడాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులకు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube