BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 01 March 2026, 03:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైభవంగా కొండాపూర్ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

తెలంగాణ
01 Mar, 2026 - 03:30 AM
273 వీక్షణలు
వైభవంగా కొండాపూర్ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ రథాన్ని లాగి ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎండపెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. రథోత్సవానికి శ్రీకారం భక్తుల జయజయధ్వానాల మధ్య మంత్రి స్వయంగా రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తిభావం మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో కొండాపూర్ గ్రామ ప్రజలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఏఎంసీ చైర్మన్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల రాకతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంలో కళకళలాడింది. #Kondapur #LakshmiNarasimhaSwamy #Rathotsavam #TempleFestival #Endapelli #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube