BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 10:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చెరువులో నీరు లేక.. వినాయకుడికి నిమజ్జన కష్టాలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 10:42 AM
29 వీక్షణలు

కరకమందలో నిమజ్జనానికి నోచుకోని గణనాథుడి విగ్రహాలు చెరువు వద్దే విగ్రహాలను వదిలి వెళ్లిన భక్తులు వినాయక చవితి వేడుకలు ముగియడంతో గణనాథుడి విగ్రహాల నిమజ్జనానికి నీరు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమల మండలం కరకమంద గ్రామంలో చెరువులో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో భక్తులు విగ్రహాలను చెరువు వద్దే ఉంచి వెనుదిరిగారు.

గ్రామంలో వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఉత్సవాలు ముగియడంతో గురువారం నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుని విగ్రహాలను చెరువు వద్దకు తీసుకెళ్లారు. అయితే చెరువులో సరిపడా నీరు లేకపోవడంతో నిమజ్జనం సాధ్యం కాలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

సాధారణంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను వినియోగిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరకమంద చెరువులో నీరు లేకపోవడంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తాయని స్థానికులు తెలిపారు. విగ్రహాలను చెరువు వద్దే వదిలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.