లక్కవరంలో విషాదం.. యువకుడి అనుమానాస్పద మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం: లక్కవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోసన తిరుమలరెడ్డి (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాను నివాసం ఉంటున్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా భార్య కాకినాడ వెళ్లినట్లు సమాచారం. తిరుమలరెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. తిరుమలరెడ్డి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.