BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 04:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మీపురంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు భూమిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 04:25 PM
166 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భూమిపూజ నిర్వహించారు.

గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ క్లినిక్ నిర్మాణానికి రావి పద్మనాభ చౌదరి కుమారులు రావి వెంకట సత్యనారాయణ చౌదరి, రావి రామమోహన్ రావు 6.50 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల విస్తరణలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం స్థలాన్ని దానం చేసిన దాతలను అభినందిస్తూ, వారి సేవా భావం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బొల్లినేని రాజా, నెక్కడపు శ్రీను, బాలమర్తి అప్పారావు, నాగరాజు, అప్పారావు తదితర నాయకులు, గ్రామ పెద్దలు, వైద్య శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.