BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 June 2026, 01:49 pm
Posted by : V శ్రీనివాస్

​లక్ష్శెట్టిపేటలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:49 PM
261 వీక్షణలు

ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య

​అర్జీలను ఓపికగా స్వీకరించి, పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్

​లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10, 13, 14, 15 వార్డులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం స్థానిక ఐబీ గెస్టు హౌస్ లో ఘనంగా నిర్వహించబడింది. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు తమ సమస్యలు, అవసరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, అధికారులు వాటిని ఓపికగా విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేస్తే వాటి పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ దిలీప్ కుమార్, ఎస్ఐ సురేష్ లతో పాటు కౌన్సిలర్లు సత్యనారాయణ, పెండం పద్మ రాజు, మైలారం సుధాకర్, గోపతి సుజాత రమేష్ పాల్గొన్నారు. అలాగే కో-ఆప్షన్ సభ్యులు చింత సువర్ణ అశోక్ కుమార్, నక్క జాకబ్, థైసిన్ హజీ, ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు మరియు వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.