BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 09:36 PM
111 వీక్షణలు

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు సమాచారం.

ముద్రగడ పద్మనాభం మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలు, ప్రజా సమస్యలపై ఆయన పోరాటాలు చిరస్మరణీయమని పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నూజివీడు నత్తా నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

"ముద్రగడ పద్మనాభం మరణం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.