BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

​మంచిర్యాలలో ఘనంగా సింగరేణి భరోసా యాత్ర..

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jul, 2026 - 09:58 PM
228 వీక్షణలు

మంచిర్యాల, జూలై 14: సింగరేణి కార్మికులకు అండగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన 'సింగరేణి భరోసా యాత్ర' రెండో రోజు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్. రాంచందర్ రావు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, బీజేెల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న బీజేపీ అగ్రనేతల బృందానికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మొదటగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నేత రాంచందర్ రావులకు పార్టీ కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికి, పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

​అనంతరం క్యాతన్ పల్లిలోని ఎంఎన్ఆర్ (MNR) గార్డెన్‌లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమమే ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగుతోందని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు